శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 జులై 2017 (19:44 IST)

దేవుడు పిలిచాడట.. ఉరేసుకున్న ముగ్గురు మహిళలు.. ఎక్కడ?

సాంకేతికత ఎంత పెరిగినా.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటివి లోకాన్ని అద్దంలా చూపెడుతున్నా.. మూఢ నమ్మకాలు ఇంకా దేశంలో షికార్లు చేస్తూనే వున్నాయి. తాజాగా దేవుడు రమ్మన్నాడంటూ.. ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంల

సాంకేతికత ఎంత పెరిగినా.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటివి లోకాన్ని అద్దంలా చూపెడుతున్నా.. మూఢ నమ్మకాలు ఇంకా దేశంలో షికార్లు చేస్తూనే వున్నాయి. తాజాగా దేవుడు రమ్మన్నాడంటూ.. ముగ్గురు మహిళలు 
ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ మండలం కరప గ్రామానికి చెందిన సత్తి ధనలక్ష్మి, సత్తి వైష్ణవి, రాశంశెట్టి సత్యవతి అనే ముగ్గురు మహిళలు దేవుడు త‌మ‌ని పిలుస్తున్నాడంటూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
ధనలక్ష్మి, వైష్ణవి, సత్యవతి మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారని కుటుంబీకులు, స్థానికులు వెల్లడించారు. పూజలు చేస్తూ.. దేవుడు తమతో మాట్లాడుతున్నాడని.. దేవుడు తమను పిలుస్తున్నాడని చెప్పేవారని.. అయితే ఇలా ఆత్మహత్యకు పాల్పడతారని అనుకోలేదని వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.