గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

బిర్యానీ పోటీలు : రూ.7 లక్షల కారును గెలుచుకున్న అదృష్టవంతుడు

nissan car
ఏపీలోని తిరుపతిలో ఆదివారం రాత్రి బిర్యానీ ఆరగించే పోటీలను నిర్వహించారు. స్థానికంగా ఉండే రోబో హోటల్‌లో ఈ పోటీలను నిర్వహించగా, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా గత రాత్రి లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో నిస్సాన్ మాగ్నైట్ కారును ఓ విజేత గెలుచుకున్నాడు. ఈ కారు ధర రూ.7 లక్షలు. దీంతో ఆ కస్టమర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
రోబో హోటల్‌లో గత యేడాది సెప్టెంబరు నెలలో బిర్యానీ ఆరగించిన ప్రతి ఒక్క కస్టమర్‌కు ఓ కూపన్ ఇచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా హోటల్ యజమాని భర్త కుమార్ రెడ్డి నీలిమ దంపతులు గత రాత్రి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో తిరుపతి పట్టణానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి విజేతగా నిలిచాడు. ఆ వెంటనే రాహుల్‌‍కు ఫోన్ చేసి విషయం చెప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇకపైనా ఇలాంట పథకాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.