1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 9 మే 2016 (11:01 IST)

తిరుపతిలో విచిత్ర వాతావరణం.. రాత్రి వర్ష బీభత్సం.. పగలు సూర్యతాపం

తిరుపతిలో అర్థరాత్రి నుంచి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదులు గాలులు తెల్లవారుజాము వరకు రావడంతో పట్టణంలోని చెట్లు నేలకొరిగాయి. రోడ్లపైనే చెట్లు పడిపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
 
రాత్రంతా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పట్టణ వాసులు నరక యాతనను అనుభవించారు. సోమవారం తెల్లవారుజామువరకు చిరుజల్లులు పడ్డాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు గానీ ఉదయం 7 గంటలు కాగానే తిరిగి వేడి గాలులు ప్రారంభమైంది.