మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 12 మార్చి 2017 (11:22 IST)

తిరుమల వెంకన్న బంగారు ఏ బ్యాంకులో.. ఎంత జమచేశారో తెలుసా...!

ఆపదమ్రొక్కుల వాడు వెంకన్నకు భక్తులకు సమర్పించే బంగారాన్ని మొత్తాన్ని బ్యాంకుల్లోకి సురక్షితంగా చేర్పించి తితిదే. 970.080 కిలోల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో గోల్డ్ మానిటైజేషన్ పథకంలో డిపాజిట

ఆపదమ్రొక్కుల వాడు వెంకన్నకు భక్తులకు సమర్పించే బంగారాన్ని మొత్తాన్ని బ్యాంకుల్లోకి సురక్షితంగా చేర్పించి తితిదే. 970.080 కిలోల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో గోల్డ్ మానిటైజేషన్ పథకంలో డిపాజిట్ చేసింది. 2016 మార్చిలో తొలుత తితిదే ఈ బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండ ఇండియాలో డిపాజిట్ చేసింది. కాలపరిమితి పూర్తి కావడంతో వడ్డీ రూపంలో వచ్చిన బంగారాన్ని కలిపి తిరిగి అదే బ్యాంకులో గోల్డ్ మానిటైజేషన్ పథకంలో ఒక శాతం వడ్డీతో 3 సంవత్సరాల కాలానికి స్వల్పకాలిక డిపాజిట్ చేసింది.
 
ఎస్‌బిఐ ఎండి రజనీష్‌ కుమార్ ఈ మేరకు తితిదే బంగారం డిపాజిట్ చేసిన పత్రాలను ఈఓ డి.సాంబశివరావుకు అందజేశారు. శ్రీవారి హుండీ కానుకల రూపంలో అందిన మిక్స్ డ్ కేటగిరి బంగారు నగలు, వస్తువులు కలిపి దాదాపు 1400 కిలోలను ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో 1.25 శాతం వడ్డీకి తితిదే డిపాజిట్ చేశారు. 
 
దీనిని మూడు సంవత్సరాల కాలపరిమితికి గోల్డ్ మానిటైజేషన్‌ పథకంలో స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ కేటగిరిలో డిపాజిట్ చేసింది. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1311 కిలోల 0.995 స్వచ్ఛత గల బంగారు కడ్డీలను 1.57 శాతం వడ్డీకి తితిదే డిపాజిట్ చేసింది. దీన్ని మూడు సంవత్సరాల కాలపరిమితికి గోల్డ్ మానిటైజేషన్ పథకంలో స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ కేటగిరిలో డిపాజిట్ చేసింది. స్వచ్ఛమైన బంగారం కేటగిరిలో ఈ బ్యాంకు చెల్లిస్తున్న వడ్డీ ఇదే అత్యధికం.