ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్
ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే ఈ కథనం చదవాల్సిందే. రోజూవారీగా కాఫీ, టీలు తాగేటప్పుడు కచ్చితంగా బిస్కెట్లు తినే అలవాటు చాలామందికి వుంటుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ అలవాటు అధికంగా వుంటుంది. అలా బిస్కెట్లు లేనిదే పొద్దు గడవని వారు ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే.
బిస్కెట్లలో మైదా వుంటుంది కాబట్టి అది ఊబకయానికి దారి తీస్తుంది. మల్టీ గ్రైన్ బిస్కెట్లు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తాయి. బిస్కెట్లలో రీఫైన్డ్ పిండి, పీచు తక్కువగా వుండటం ద్వారా జీర్ణ సంబంధిత ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బిస్కెట్లలో సోడియం అధిక శాతం వుండటంతో థైరాయిడ్, మధుమేహం వ్యాధిగ్రస్థులు దీనిని తీసుకోవడం తగ్గించాలి. రోజూ క్రీమ్ బిస్కెట్లు తీసుకుంటూ వుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.
తద్వారా ఇన్ఫెక్షన్లు తప్పవు. బిస్కెట్లలో అధికంగా పంచదార వుండటంతో డయాబెటిస్ ఏర్పడే ప్రమాదం వుంది. బిస్కెట్లలో కొవ్వు శాతం అధికంగా వుండటం ద్వారా మొటిమలు, ముడతలు ఏర్పడే ప్రమాదం వుంది.