గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (13:46 IST)

శ్రవణ్‌ను ''డార్లింగ్'' అని సంబోధించిన శిరీష: హ్యాపీగా ఉండు.. దానికి టార్చర్ చూపిద్దాం.. అని ఎవరన్నారు..?

సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసులో ఆడియో టేపులు కీలకమైన ఆధారాలుగా మారనున్నాయి. శిరీష ఫోన్ సంభాషణ వివరాలు ఈ కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. శిరీష తన ఫోనులో రాజీవ్ స్నేహితుడు శ్రవణ్‌తో అత్యంత

సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసులో ఆడియో టేపులు కీలకమైన ఆధారాలుగా మారనున్నాయి. శిరీష ఫోన్ సంభాషణ వివరాలు ఈ కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. శిరీష తన ఫోనులో రాజీవ్ స్నేహితుడు శ్రవణ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండేదని వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను బట్టి తెలుస్తోంది. శ్రవణ్‌ను డార్లింగ్ అంటూ శిరీష సంబోధించినట్లు సమాచారం. రాజీవ్‌కు, మరో యువతి తేజస్వినికి మధ్య ఉన్న సంబంధాలపై శ్రవణ్‌ వద్ద శిరీష ఆరా తీసింది.
 
తేజస్విని తనకు 'ఎనిమీ' అంటూ శ్రవణ్‌తో శిరీష చెప్పింది. రాజీవ్‌-తేజస్విని ఫోనులో ఏం మాట్లాడుకున్నారో వాయిస్ రికార్డ్ చేసి వినిపించాలని శ్రవణ్‌ను అడిగింది. శిరీష మాటలకు సరేనన్న శ్రవణ్, ఇక నువ్వు హ్యాపీగా ఉండు... దానికి(తేజస్విని) టార్చర్ చూపిద్దాం అనే సంభాషణ శిరీష ఫోనులో ఉంది. రాజీవ్ ఫోన్‌లోని రికార్డింగ్‌ను ఎలాగైనా తనకు పంపాలని శ్రవణ్‌ను శిరీష ప్రాధేయపడింది. 
 
కాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన శిరీష కేసుకు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆమెది ఆత్మహత్యే అనే తేల్చిన పోలీసులు, శిరీషకు సంబంధించిన ఆడియో టేపులను పరిశీలించారు. శిరీష, రాజీవ్, శ్రవణ్‌ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను బంజారాహిల్స్ పోలీసులు సేకరించారు. ఈ ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా శిరీష ఆడియోను పోలీసులు నిర్ధారించనున్నారు.