1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2016 (14:44 IST)

పోలవరం ప్రాజెక్టును కడతారా..? కట్టరా?: చంద్రబాబును ప్రశ్నించిన ఉండవల్లి

పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, ప్రభుత్వ

పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసి నిన్న పట్టిసీమ అన్న ప్రభుత్వం ఇప్పుడు సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల అంటూ కొత్త నాటకానికి తెరతీశారన్నారు.
 
పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఎందుకు కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ కడతారా...కట్టరా అనే అనుమానాలున్నాయని తెలిపారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులు లెక్క చెప్పకుండా మరో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు.