తిరుమలలో జనవరి 2న వైకుంఠద్వార దర్శనం..
పవిత్ర పుణ్యస్థలం తిరుమలో జనవరి రెండో తేదీన వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం జనవరి ఒకటో తేదీ నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. వీటిని తిరుమలలోని మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో జారీ చేయనున్నారు. ఈ టోకెన్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు.
జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రోజుకు 50 వేల మందికి చొప్పున ఈ దర్శనం కల్పిస్తారు. మొత్తం పది రోజుల పాటు 5 లక్షల టోకెన్లను జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ పది రోజుల కోటా పూర్తయ్యేంత వరకు ఆఫ్‌లైన్‌లో ఈ టోకెన్లను నిరంతరాయంగా జారీ చేస్తారు.
ఈ టోకెన్లను తిరుమలలో శ్రీనివాసం, తుడా ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ సత్రాలు, శేషాద్రి నగర్ జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూలు, బైరాగిపట్టెడ జడ్పీ హైస్కూలులో టోకెన్లను జారీ చేసేందుకు వీలుగా తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.