శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2016 (15:54 IST)

కోతి ఇంట్లో చాక్లెట్ డబ్బా ఎత్తుకెళ్లిందని భార్యపై భర్త ఫైర్.. భార్య ఆత్మహత్య

కోతి ఓ వివాహిత మృతికి కారణమైంది. తన తిక్క చేష్టలతో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేసింది. ఓ ఇంట్లోకి దూరి ఇల్లంతా గుల్ల చేసి ఎక్కడకో వెళ్ళిపోయింది. అయితే కోతి చేసిన చేష్టలతో భార్యాభర్తల గొడవ చినికి చిని

కోతి ఓ వివాహిత మృతికి కారణమైంది. తన తిక్క చేష్టలతో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేసింది. ఓ ఇంట్లోకి దూరి ఇల్లంతా గుల్ల చేసి ఎక్కడకో వెళ్ళిపోయింది. అయితే కోతి చేసిన చేష్టలతో భార్యాభర్తల గొడవ చినికి చినికి గాలి వానలా మారి తుఫాను వీసింది. ఫలితం వివాహిత ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన కందకట్ల మనోహర (40), శ్రీనివాస్ దంపతులు.. సైకిల్ స్టాండ్‌తో పాటు కిరాణం షాపు నడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం (నవంబర్ 11) సాయంత్రం మనోహర ఇంట్లోకి దూరి చాక్లెట్ డబ్బాలు ఎత్తుకెళ్లింది. 
 
కోతి ఇంట్లోకి ప్రవేశించేదాకా ఏం చేస్తున్నావ్.. ఎందుకు దాన్ని తరిమికొట్టలేదంటూ మనోహరను శ్రీనివాస్ గట్టిగా మందలించడంతో పాటు దూషించాడు. దీంతో మనోహరకు కోపం రావడంతో భర్తతో వాగ్వివాదానికి దిగింది. ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో భార్య కోపంతో పాటు ఉద్వేగానికి లోనై అవమాన భారాన్ని తట్టుకోలేక మనోహర ఇంట్లోకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇన్నాళ్లు చికిత్స పొందిన మనోహర సోమవారం మృతి చెందింది. ఇదిలా ఉంటే మనోహరతో శ్రీనివాస్‌ నిత్యం గొడవ పెట్టుకునే వాడని మనోహర బంధువులు తెలిపారు. బాధితురాలి తల్లి వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.