శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (11:07 IST)

నయీమ్ ఆయుధాలు బయటపడ్డాయ్.. పడకగదిలో తుపాకీ తూటాలు..

ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆయుధాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చేపట్టిన సోదాల్లో పెద్ద సంఖ్యలో బులెట్లు, కళ్లు చెదిరే మారణాయుధాలు, సీసీటీవీతో అత్యాధునిక భద్రతా వ్యవస్థ డెన్‌లో బయటపడింద

ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆయుధాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చేపట్టిన సోదాల్లో పెద్ద సంఖ్యలో బులెట్లు, కళ్లు చెదిరే మారణాయుధాలు, సీసీటీవీతో అత్యాధునిక భద్రతా వ్యవస్థ డెన్‌లో బయటపడింది. నార్సింగ్‌లోని నయీం డెన్‌లోకి పోలీసులు మాత్రమే వెళ్లగా తొలిసారి మీడియా కూడా ఎంటరైంది.
 
ఈ డెన్ లోపలికి నయీం సన్నిహితులకు మాత్రమే ఎంట్రీ వుండేదని సమాచారం. నయీం తన ఇంటి పరిసరాల్లోకి వచ్చే వ్యక్తుల కదలికలు తెలుసుకునేందుకు వీటిని ఏర్పాటు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నయీమ్‌ కేసు విచారణలో భాగంగా సిట్‌ అధికారులు రెండు రోజులుగా సోదాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాతోపాటు షాద్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
 
గత ఏడాది ఆగస్టు 8వ తేదీన షాద్‌నగర్ వద్ద పోలీస్ కాల్పుల్లో నయీమ్ మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం కొండాపూర్‌లోని అల్కాపురికాలనీలో నయీం ఉంటున్న ఇంట్లో సైబరాబాద్‌ పోలీసులు సోదాలు నిర్వహించగా.. పడక గదిలో పెద్ద సంఖ్యలో తుపాకీ తూటాలు కనిపించాయి. పాలిథిన్ సంచుల్లో ఒక స్టెన్‌గన్ మరికొన్ని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.