శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (17:21 IST)

స్నేహితుడి భార్యపై కన్నేశాడు.. భర్త తీసుకురమ్మన్నాడని నమ్మబలికి..?

స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చే వారుంటారు. కానీ స్నేహితుడి భార్యపై కన్నేశే కామాంధులు ప్రస్తుతం పెరిగిపోతున్నారు. తాజాగా స్నేహితుడి భార్యను అనుభవించాలనే దురాలోచన ఓ వ్యక్తిని జైలు పాలు చేసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఏలూరు రామకృష్ణాపురంలోని ఒక ఆస్పత్రి సమీపంలో అద్దెకు ఉంటున్న కారు డ్రైవర్‌ పల్లి నానిబాబు, మరో డ్రైవర్‌ హేమ సుందర్ అలియాస్ సురేష్ ఇద్దరూ మంచి స్నేహితులు. 
 
హేమ సుందర్‌కు అతని భార్యకు తరచూ మనస్పర్థలు రావడం గమనించిన నాని ఏలాగైనా ఆమెకు దగ్గర కావాలనుకున్నాడు. అవకాశం కోసం ఎదురుచూస్తుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 9న సురేష్ భార్య ద్వారకా తిరుమలలోని పుట్టింటికి వెళ్లింది. 
 
సురేష్ ఏమో కిరాయి నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన నాని ఈ నెల 11వ తేదీ ఆమెకు ఫోన్‌ చేసి.. భర్త తీసుకురమ్మన్నాడని నమ్మబలికాడు. మరో డ్రైవర్‌ కాశీ సహకారంతో ఆమెను కారులో ఏలూరులోని తన రూమ్‌కి తీసుకొచ్చి బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
స్థానికుల ద్వారా విషయం తెలిసిన ఆమె భర్త వచ్చి భార్యను విడిపించటానికి సురేష్ నాని రూమ్‌కి వెళ్లగా అతనిని కూడా గాయపరిచారు. అయితే బాధితురాలి బంధువులు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మూర్తి కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితులైన నాని బాబు, కాశీలను అరెస్ట్‌ చేసి కారును సీజ్‌ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.