మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 మే 2016 (17:02 IST)

భార్య నుంచి డబ్బు గుంజేందుకు భర్త వాట్సాప్ డ్రామా?

అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మరమగ్గాల వ్యాపారి కిడ్నాప్ కేసులో వాట్సాప్ వీడియో పెనుదుమారం రేపిన సంగతి విదితమే. అయితే ఈ కేసును పోలీసులు ఓ కట్టుకథగా తేల్చిపారేశారు. కొద్ది రోజుల క్రితం రామాంజనేయులుని కిడ్నాప్ చేశామని వాట్సాప్‌లో ఓ వీడియో వచ్చింది, అందులో రామాంజనేయులును రెండు బండరాళ్ల మధ్య కట్టేసి, నోటికి గుడ్డలు కుక్కినట్లు ఉండడంతో అతని భార్య, తండ్రి తీవ్ర ఆందోళన చెందారు. 
 
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపడంతో పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అధికారులు మొదట రామాంజనేయులు ఫోన్‌ని ట్రాప్ చేయగా, అతను బెంగళూరు సమీపంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని విచారించగా భార్య నుంచి డబ్బు కోసమే ఇలా చిత్రీకరించానని నిజం ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.