బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:15 IST)

3 రాజధానుల్ని వ్యతిరేకించినవారే తర్వాత స్వాగతిస్తారు: సజ్జల

3 రాజధానుల్ని ఇప్పుడు వ్యతిరేకించినవారే తర్వాత స్వాగతిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్ దూరదృష్టితో మూడు రాజధానులు, అభివృధ్ది వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

పార్టీ వాణిజ్య విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన వ్యవస్ధను కుప్పకూల్చారని విమర్శించారు.

రాష్ట్ర విభజన కంటే గత ఐదేళ్ల పాలనలోనే అత్యధిక నష్టం రాష్ట్రానికి జరిగిందని తెలిపారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం లేదన్నారు.

ఒక భాగాన్ని విశాఖకు, మరొక భాగాన్ని రాయలసీమకు తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ వాణిజ్య విభాగం ప్రజలకు మేలు చేసే ఈ నిర్ణయాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని సజ్జల కోరారు.