సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 డిశెంబరు 2020 (11:22 IST)

పిల్లలు పుట్టలేదని మరో వ్యక్తికి దగ్గరైన భార్య, నడిరోడ్డుపై నరికేశాడు

తూర్పుగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో దారుణం జరిగింది. తన భార్య వేరొకరితో వుంటోందని ఆగ్రహం చెందిన భర్త ఆమెను నడిరోడ్డుపైనే నరిగి చంపేశాడు.
 
వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి గణపవరం మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన చంటియ్యకు అదే మండలం మెయ్యేరు గ్రామానికి చెందిన చంద్రికతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఐతే వారికి సంతానం కలుగలేదు. దీనితో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.ట
 
ఈ క్రమంలో భార్య చంద్రికకు సోషల్ మీడియా ద్వారా జెర్సీ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె తన భర్తను వదిలేసి ఆ యువకుడితో వుండిపోవాలని నిశ్చయించుకుంది. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది.
 
కానీ భర్తకు ఇది నచ్చలేదు. దీనితో యువకుడు జెర్సీ బైక్ పైన వెళ్తున్న భార్యను రోడ్డుపై అడ్డగించాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తనతో తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. దాంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. జెర్సీ విషయాన్ని పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో వున్నారు.