గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (15:31 IST)

వివాహేతర సంబంధం.. వద్దమ్మా అన్నాడు.. అంతే కన్నకొడుకునే చంపేసింది..

వివాహేతర సంబంధాలు.. వాటి ద్వారా జరిగే నేరాలు అధికమవుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డు చెప్తున్నాడనే కారణంగా కన్నకొడుకునే కర్కశ తల్లి హత్య చేసింద

వివాహేతర సంబంధాలు.. వాటి ద్వారా జరిగే నేరాలు అధికమవుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డు చెప్తున్నాడనే కారణంగా కన్నకొడుకునే కర్కశ తల్లి హత్య చేసింది. 
 
ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలోని గాయత్రీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వివాహిత 17 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయింది. భర్తతో విడిపోయిన తర్వాత ఆమె కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
ఈ వ్యవహారంపై ఆమె కుమారుడు హరిభగవాన్‌ గొడవకు దిగేవాడు. దీంతో తల్లీకుమారుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో హరి భగవాన్ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆ తల్లి భావించింది. భోజనంలో నిద్రమాత్రలను కలిపి హరిభగవాన్‌కు ఇచ్చింది. భోజనం తిన్న తర్వాత హరిభగవాన్ మత్తులోకి జారుకొన్నాడు. ఆపై చున్నీతో అతడి గొంతు బిగించి హత్య చేసింది. 
 
ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో కుమారుడిని హత్యచేసినట్లు ఒప్పేసుకుంది. అయితే హరిభగవాన్ హత్యలో ప్రియుడి ప్రమేయం కూడ ఉందా లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది.