మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (05:45 IST)

పవన్ కళ్యాణ్ మాటపై నిలబడే వ్యక్తికాదు.. ఓ పిరికిపంద : ఎమ్మెల్యే రోజా

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ మాటపై నిలబడే వ్యక్తికాదనీ కాదనీ, ఓ పిరికిపంద అని వైకాపా ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు.

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ మాటపై నిలబడే వ్యక్తికాదనీ కాదనీ, ఓ పిరికిపంద అని వైకాపా ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. 
 
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ, ఇప్పటికీ ఆయన ఇస్తున్నవాగ్దానాలు, హామీల్లో చాలా మార్పు ఉందని, నిలకడ లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ మాటలు కేవలం తన వ్యక్తిగతమే కాదనీ, ప్రజల మనోగతం కూడా అని వ్యాఖ్యానించారు. 
 
ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎమ్మెల్యేను పిలిచి అవమానించిన కర్నూలు ఘటనతోనే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు దౌర్జన్యం ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దౌర్జన్య, అరాచక పాలన సాగుతోందన్నారు.