శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (13:39 IST)

నాకైతే అర్థం కావట్లేదు.. అసలీమనిషికి కాస్తోకూస్తోనయినా ఇంగ్లీషు వ‌స్తుందా?: చ‌ంద్ర‌బాబుపై జ‌గ‌న్ ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్రం తీరుని నిరసిస్తూ ఏలూరులో ఆయ‌న‌ యువభేరీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జగన్ మాట్లాడుతూ ఆరోజు నుంచి ఈ ర

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్రం తీరుని నిరసిస్తూ ఏలూరులో ఆయ‌న‌ యువభేరీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జగన్ మాట్లాడుతూ ఆరోజు నుంచి ఈ రోజు వ‌ర‌కు హోదా కోసం తాము పోరాటాన్ని కొన‌సాగిస్తున్నామ‌ని అన్నారు. కాంగ్రెస్ ఐదేళ్లు అంటే కాదు ప‌దేళ్లు అని బీజేపీ నేత‌లు అన్నారని, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వెంక‌య్య‌నాయుడు ఆరోజు రాజ్య‌స‌భ‌లో ఏపీ విభ‌జ‌న‌పై ఎన్నో మాట‌లు చెప్పారని గుర్తు చేశారు.  
 
‘బీజేపీ అధికార‌లోకి వ‌స్తే ప‌దేళ్లు ఇస్తామ‌ని చెప్పారు. ప్ర‌త్యేక హోదా సంజీవినీ బీజేపీ, టీడీపీ నేత‌లు పొగిడారు. మ‌రి ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్పుడు ఆ నేత‌లు మాట‌లు మార్చి మాట్లాడుతున్నారు. హోదాపై జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే బాధ‌క‌లుగుతోంది. హోదాతో ఉద్యోగాలు వ‌స్తాయ‌ని మాట్లాడిన వారే రెండున్న‌రేళ్ల‌యినా ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. 
 
'ఢిల్లీలో ప్ర‌క‌ట‌న చేయ‌డ‌మే ఆల‌స్యం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆ ప్రక‌ట‌న‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని అన్నారు. నాకైతే ఆశ్చ‌ర్యం అనిపించింది.. అస‌లీ మ‌నిషికి కాస్త కూస్తోన‌యినా ఇంగ్లీషు వ‌స్తుందా? అనిపించింది. అంత‌టితో ఆగ‌లేదు. హోదాతో లాభం లేదు అంటూ వ్యాఖ్య‌లు చేశారు. హోదా వల్ల ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్‌కు ఏం లాభం జ‌రిగింద‌ని అన్నారు.. రాష్ట్రాన్ని విడ‌గొట్టేట‌ప్పుడు ఐదేళ్లు కాదు ప‌దేళ్లు అన్నారు. మ‌ళ్లీ మొన్న హోదాతో ఏమొస్తుంద‌ని అన్నారు. మీకు న్యాయ‌మేనా అని అడుగుతున్నాను’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.