శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:02 IST)

నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. చంద్రబాబుకు ఏమున్నాయో నాకు తెలియదు : జగన్

తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, కానీ, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏమైనా ఉన్నాయేమో తనకు తెలియదని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై తమ సొంత టీవీ చానెల్ సాక

తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, కానీ, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏమైనా ఉన్నాయేమో తనకు తెలియదని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై తమ సొంత టీవీ చానెల్ సాక్షి టీవీ ద్వారా ప్రవాసాంధ్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, చంద్రబాబుకు ఏమున్నాయో తనకు తెలియదని అన్నారు. తను భార్యాబిడ్డలతో సంతోషంగా ఉన్నానని అన్నారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు కూడా అబద్దాలు నేర్పుతున్నారని, మంచి లక్షణాలు నేర్పడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. తాగుడు అలవాటో మరో అలవాటో తనకు లేదన్నారు. 
 
తాను పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తినన్నారు. చివరకు సొంత కొడుకును కూడా చెడగొడుతున్న వ్యక్తి చంద్రబాబు అని జగన్ విమర్శించారు. ఏ కొడుకైనా తండ్రినే రోల్‌ మోడల్‌గా తీసుకుంటారని ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న అబద్దాలు, మోసాలు, వెన్నుపోట్లు చూసి ఆయన కుమారుడు కూడా చెడిపోతున్నారన్నారు.