ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (12:21 IST)

పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. సీఎం జగన్ ట్వీట్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వైకాపా ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్‌కు ఏపీ మంత్రులు వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. పేదల గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారన్నారు. దేశంలో సంక్షేమ విప్లవం తెచ్చిన మహా నేత రాజశేఖర్‌రెడ్డి అని మంత్రి అవంతి కొనియాడారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. 
 
"చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం
మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
నీ ఆశయాలే నాకు వారసత్వం
ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా...
పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
జన్మదిన శుభాకాంక్షలు నాన్నా..."