గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (16:44 IST)

ఏపీ సీఎం జగన్‌తో అనిల్ కుంబ్లే భేటీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భారత్ దిగ్గజ స్పిన్ బౌలర్, మాజీ టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా జగన్‌తో కరచాలనం చేసిన కుంబ్లే... ఆయనకు పుష్పగుచ్ఛాన్ని, జ్ఞాపికను అందించారు. మర్యాదపూర్వకంగానే జగన్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ కుంబ్లే కలిసినట్టు వైసీపీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.