ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (14:28 IST)

ఏపీలో కర్ఫ్యూ సడలింపులు... ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోవున్న కర్ఫ్యూ సడలింపుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అయితే, ఉభయగోదావరి జిల్లాల్లో సాయంత్రం 6 గంటలకే దుకాణాలను మూసివేస్తామన్నారు. పాజిటీవీటీ రేటు 5 లోపు వచ్చేంత వరకూ ఆంక్షల కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉండనున్నాయి.
 
అయితే, ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాలను మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు. సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా సినిమా థియేటర్లకు అనుమతి లభించనుంది. రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండపాలకు కొవిడ్‌ నిబంధనలతో అనుమతి లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి చేశారు.
 
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి నానితో పాటు... ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.