మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జులై 2021 (11:31 IST)

కర్ఫ్యూ సడలింపులపై ఏపీ సర్కారు నిర్ణయం..

కర్ఫ్యూ సడలింపులపై ఏపీ సర్కారు తగిన నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ కఠినంగా అమలు చేయడం, వ్యాక్సినేషన్ కారణంగా గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ రోజువారీ కేసులు 3వేలకు పైగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ బుధవారంతో తేదీతో ముగియనున్న నేపథ్యంలో సీఎం జగన్ సోమవారం కోవిడ్ పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
 
ప్రస్తుతం 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షల నుంచి సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదు అవుతున్న 5 జిల్లాల్లో ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉంది.
 
ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, కోవిడ్‌ నిబంధనలపై సమీక్షించనున్నారు. అయితే కర్ఫ్యూ నిబంధనలు మరింత సడలిస్తారా? లేక మొత్తం ఎత్తేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.