బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (14:14 IST)

ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి పీకేస్తారా కేసీఆర్ దొరా? షర్మిల ప్రశ్న

ప్రభుత్వం కోసం పని చేస్తున్న ఉద్యోగులకు భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తనను ప్రశ్నించిన ఉద్యోగులను ఉద్యోగం నుంచి పీకేస్తారా అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన బాధ్యతలను విస్మరించారనీ, దాన్ని గుర్తు చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు జీతాలు పెంచాలని ఆందోళన చేశారన్నారు. ఇలాంటి వారికి జీతాలు పెంచాల్సిందిపోయి ఉద్యోగాల నుంచే తీసేస్తారా అని ఆమె నిలదీశారు. 
 
ఇందిరాపార్కు వద్ద కాంట్రాక్ట ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, ప్రభుత్వం కోసం పని చేస్తున్న ఉద్యోగులకు భరోసా కల్పించాలని కోరారు. అలాగే, ప్రజల గురించి పెట్టించుకోని కేసీఆర్ వంటి నేతకు సీఎం పదవి అక్కర్లేదన్నారు. కేవలం ప్రశ్నించినందుకు 7560 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రోడ్డున పడేశారన్నారు. 
 
ప్రశ్నించడం అనేది తెలంగాణ సిద్ధాంతం. విధానం. నినాదం కూడా. అలాంటిది ప్రశ్నించిన పాపాన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడం ఎంత వరకు సబబని షర్మిల ప్రశ్నించారు.