మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (20:04 IST)

రోజా ప్రవర్తన మారలేదు.. సభలోకి అడుగుపెట్టకూడదు.. మరో యేడాది సస్పెన్షన్?

వైకాపాకు చెందిన ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో మరో యేడాది రోజా పాల్గొనకుండా సస్పె

వైకాపాకు చెందిన ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో మరో యేడాది రోజా పాల్గొనకుండా సస్పెన్షన్‌ను పొడగించనున్నారు. 
 
ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో రోజాపై ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ పరిశీలించింది. దీనిపై రోజా ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందలేదని అన్నారు. 
 
దీంతో రోజాపై మరోఏడాది నిషేధం కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేసింది. దీంతో రోజాపై మరోఏడాది నిషేధం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏడాది అసెంబ్లీ నిషేధం ఏదుర్కొన్న రోజాపై మరోఏడాది నిషేధం అమలు చేయడం పట్ల ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.