1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-05-202 మంగళవారం దినఫలాలు - పెంపుడు జంతువుల పట్ల మెళకువ అవసరం...

Astrology
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ త్రయోదశి సా.4.38 స్వాతి పూర్తి ప.వ.11.14 ల 12.58. ఉ.దు.8.07 ల 8.58 రా.దు. 10.48 ల 11.33.
 
మేషం :- విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచాలి. పెంపుడు జంతువుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు టీ.వీ కార్యక్రమాల్లో నిరుత్సాహం తప్పదు. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృషభం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ పలుకుబడి, వ్యవహార దక్షతతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. అయిన వారి కోసం తాపత్రయపడతారు. మీ శ్రీమతి సలహా పాటింటం వల్ల మేలే జరుగుతుంది.
 
మిథునం :- ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. వాహనం ఏకాగ్రతతో నడపాలి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం అధికం. నిరుద్యోగులు విజయం సాధిస్తారు. రిటైర్డు ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. ఏ పని తలపెట్టినా మొదటికే వస్తుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
కర్కాటకం :- ఆత్మీయులు, చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. భాగస్వామిక ఒప్పందాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
సింహం :- ఒక స్థిరాస్తి విక్రయంలో సోదరీ సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కుంటారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. గృహ మార్పు వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి, సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం.
 
కన్య :- మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కార్యసాధనకు మరింతగా శ్రమించాలి. వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవంగడిస్తారు. మీ పలుకుబడి, వ్యవహార దక్షతతో కొన్ని అనుకున్నది సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
తుల :- వృత్తుల వారికి గుర్తింపు, ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు ఆలస్యంగా గుర్తిస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పారిశ్రామికవేత్తలు, ఇసుక కాంట్రాక్టర్లకు నిరుత్సాహం అధికం. నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. అయాచితంగా వచ్చే కానుకలను సున్నితంగా తిరస్కరించండి.
 
వృశ్చికం :- వార్తా సిబ్బందికి చిన్న చిన్న తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమం కాదు. ఉన్నతస్థాయి అధికారులకు స్థానభ్రంశం, హోదా మార్పు వంటి ఫలితాలున్నాయి. ఆత్మీయులకు ప్రియమైన వస్తువులు అందజేస్తారు. మీ పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
ధనస్సు :- స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి నెలకొంటుంది. శారీరకశ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులకు మరింత చేరువవుతారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. రాబడికి తగ్గట్టుగానే ఖర్చులుంటాయి.
 
మకరం :- వ్యాపారులకు అధికారిక దాడులు, షాపు గుమాస్తాల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు ఆలస్యంగా గుర్తిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి.
 
కుంభం :- అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. వ్యాపార వర్గాల వారికి చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
మీనం :- మిత్రుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి నెలకొంటుంది. కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు గడిస్తారు. నిరుద్యోగుల ఉపాధి పథకాలకి మంచి స్పందన లభిస్తుంది. అధికారులు ధనప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.