1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. Your Weekly Horoscope, July 05 2026 _ July 11, 2026

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

Weekly Horoscope
Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మంగళవారం నాడు చేపట్టిన పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయుల రాక ఉత్సాహం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానం మొండితనం విసుగు కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త, ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీయోగం. అధికారులకు కొత్త బాధ్యతలు. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. కావలసిన ధనాన్ని సౌమ్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గురువారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక నీలువడదు. మొండిధైర్యంతో ముందడు వేస్తారు. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ వైద్య సేవా రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. స్థిర వ్యాపారాలు ఊపందుకుంటాయి.  వాహనంపై దూరప్రయాణం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొన్ని ఆలోచనలు స్ఫురిస్తాయి, అవశాలను దక్కించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. శనివారం పనులు నిదానంగా సాగుతాయి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు తప్పనిసరి. ఆత్మీయుల రాక ధైర్యాన్ని ఇస్తుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ఉద్యోగులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. అధికారులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకూలతలు అంతంత మాత్రమే. ఏ పని చేపట్టినా మొదటికి వస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమనస్కంగా గడుపుతారు. ఆదాయం నిరాశాజనకం. సోమవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వృత్తి ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతికి అభ్యంతరాలెదురవుతాయి. వాహనం ఇతరులకిచ్చి అవస్థలు పడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెంటాడుతుంది. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు సంతృప్తినిస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం అన్ని విధాలా అనుకూలం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తి చేయగలుతారు. మీ చొరవతో వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దూరప్రయాణం తలపెడతారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం భాగుంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త, ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు ఆలోచింపచేస్తాయి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సన్నిహితులతో తరచు సంభాషిస్తుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులకు స్థానచలనం, ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు రావు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు మెరుగుపడతాయి. లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు, స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఆదివారం నాడు పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. అధికారులకు బదిలీ. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. ఇతరులను సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ముఖ్యం కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గురువారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. దంపతుల మధ్య అవగాహన లోపం. కొత్త సమస్య తలెత్తే ఆస్కారం ఉంది. సామరస్యంగా మెలగండి. ఆత్మీయ ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త గృహమార్పు అనివార్యం. చిన్నవాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగస్తుల్లో బాధ్యతల మార్పు, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్ద వ్యాపారులకు కష్టదాయకం. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇతరుల విషయాల్లో జోక్యం మంచిది కాదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అయిన వారే మీ తీరును తప్పుపడతారు. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. రావలసిన ధనం సమయానికి అందుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధి కాదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను విశ్వసించవద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఓర్పుతో మరోసారి యత్నించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. న్యాయవాదులు, డాక్టర్ల ఆదాయం బాగుంటుంది. ఉపాధి పథకాలపై దృష్టిసారిస్తారు. వ్యాపారాలు నిరాశాజనకం, షాపుల మార్పు అనివార్యం. పందేలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆత్మీయులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఖర్చులు అదుపులో వుండవు. దుబారాగా ఖర్చు చేస్తారు. బుధవారం నాడు పనులు చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు ముఖ్యమైన పనులు, ఇతరులకు పురమాయించవద్దు. కొందరి అలక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అనుకున్న లక్ష్యం నిరవేరుతుంది. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం చేస్తారు. సోమవారం నాడు ఊహించని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. గృహలలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులకు బదిలీతో కూడిన పదోన్నతి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మాటతీరుతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పందాలు, సాహసకృత్యాలకు పాల్పడవద్దు.
About Writer
పి.ప్రసూనా రామన్