ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుంటే అవన్నీ తగ్గిపోతాయ్...

ayurvedic hospital
Last Updated: శుక్రవారం, 11 జనవరి 2019 (13:23 IST)
సాధారణంగా కడుపులో రకరకాల బాధలు కలుగుతుంటాయి. వీటన్నింటికీ ఆనంధబైరవి చాలా మంచి మందు. ఇది నేరుగా ఆయుర్వేద మందులషాపులో లభిస్తుంది.

1. ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుని అల్లపురసం త్రాగితే వాంతులు, కడుపులో మంట, నోట్లో నీళ్లూరడం, గ్యాస్ ట్రబుల్స్, పుల్లటి త్రేనుపులు, జ్వరం ఇవన్నీ తగ్గిపోతాయి.

2. ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుని మిరియాల్ని నేతిలో వేయించి దంచి, తడిపి నూరి, రసాన్ని బాగా పిండి, రసంలో పంచదార కలుపుకుని త్రాగుతుంటే కడుపు, శరీర నొప్పులు, జలుబు, దగ్గు నివారిస్తాయి.

3. ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుని, కుటజారిష్ట అనే ఆయుర్వేద మందును రెండుచెంచాలు తీసుకుని, నీళ్ళు కలిపి త్రాగితే రక్తవిరోచనాలు, జిగట విరేచనాలు, అమీబియాసిస్ వ్యాధులు నివారిస్తాయి.

4. బీపీ ఉన్నవారు ఆనందభైరవి మాత్రలను రెండుపూటలా రెండేసి చొప్పున తీసుకుంటూ, యష్టిచూర్ణం పావుచెంచా పాలలో కలుపుకుని త్రాగుతుంటే బీపీ అదుపులో ఉంటుంది.

5. బూడిదగుమ్మడి రసం తీసుకుని దానికి సమానంగా ఆవుపాలు కలిపి, అందులో పదోవంతు ఉసిరిపొట్టును కలిపి పొయ్యిమీద పెట్టి నీరంతా కరిగిపోయి ముద్దగా అయ్యే వరకూ వండాలి. ఈ వచ్చిన ముద్దకు సమానంగా పంచదారను కలిపి రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో చెంచా తింటుంటే కడుపులోని అనేక దోషాలు, పేగుపూత, రక్తస్రావాలు, అసిడిటీ తగ్గిపోతుంది. గుండె జబ్బులు రాకుండా ఈ ఔషధం కాపాడుతుంది.దీనిపై మరింత చదవండి :