మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (13:19 IST)

ఏనుగుపాలు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..?

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. తరచు పాలు తీసుకుంటే.. చర్మం అందంగా కూడా తయారవుతుంది. పాలలోని న్యూట్రియన్ ఫాక్ట్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. మరి ఈ కింద తెలిపిన పాలు తాగితే కలిగే ప్రయోజనాలు, లాభాలు ఓసారి చూద్దాం..
 
1. ఆవుపాలు మధురంగా ఉంటాయి. శరీరానికి పుష్ఠినిచ్చి బలాన్ని, చేకూరుస్తాయి. జీవశక్తిని పెంపొందిస్తాయి. వాతాన్ని పైత్యాన్ని తగ్గిస్తాయి. జ్వరము, రక్తపిత్తము శ్వాసవ్యాధులను నివారిస్తుంది. 
 
2. మేకపాలు అజీర్ణమును, అతిసార వ్యాధిని నిర్మూలిస్తాయి. పాలమీద నురుగు తీసుకున్న అతిసౌరవ్యాధి, జ్వరము, శ్లేష్మ జనితమైన వ్యాధులు హరిస్తాయి. పాలను కాచి, కవ్వముతో బాగా చిలికిన తరువాత తీసుకుంటే బలాన్ని కలిగిస్తాయి. ఉత్సాహాన్నిస్తాయి. వాతవ్యాధులను నిర్మూలిస్తాయి. 
 
3. గొర్రెపాలు మధురంగా ఉంటాయి. వాత, పైత్య వ్యాధులను తగ్గిస్తాయి. ఏనుగుపాలు బలాన్నిస్తాయి. వాత, శ్లేష్మ వ్యాధులను తగ్గిస్తాయి. వీర్యవృద్ధి కలుగుతుంది. గుర్రము పాలు బలాన్నిస్తాయి. శ్వాసవ్యాధులు, వాత వ్యాధులను తగ్గిస్తాయి.
 
4. పచ్చిపాలను తాగకూడదు. కాగిన పాలలో ఉప్పు కలుపుకుని తాగకూడదు. పండ్ల రసాలతో కలిపి పాలను తీసుకోరాదు. గాడిదపాలు శ్వా, వాత రోగములను తగ్గిస్తాయి. బాల వ్యాధులన్నింటిని నిర్మూలిస్తాయి.
 
5. ఒంటెపాలు చాలా మధురంగానూ, కొంచెం ఉప్పుగానూ ఉంటాయి. ఇవి ఉదరరోగాలన్నింటిని నివారిస్తాయి. పాలలో చక్కెర కలిపి తీసుకుంటే కఫము పెరుగుతుంది. వాత వ్యాధులు నయమవుతాయి.
 
6. పురుషులలో వీర్యము వృద్ధి చెందుతుంది. బెల్లమును కలిపి తీసుకుంటే పైత్యం పెరుగుతుంది.