మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (10:20 IST)

నిమ్మరసంలో పసుపు, ఉప్పు కలిపితే..?

ప్రతిరోజూ పరగడుపున ఓ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక నిమ్మకాయ రసం కలుపుకుని అందులో కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది. శరీర వేడివలన కలిగే జలుబుకు, నిమ్మషర్బత్ బాగా పనిచేస్తుంది. ఆరోగ్యరీత్యా లెమన్ టీ ఎంతో మంచిది. భోజనానికి ముందు, తరువాత నిమ్మచెక్కతో చేతులు శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది.
 
ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాససన చూడడం, నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం కలుగుతుంది. శరీరం నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి నీటిలో నిమ్మరసం పిండుకుని తాగడం వలన తక్షణమే శక్తి కలుగుతుంది. మంచి పోషకపదార్థాలతో పాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తుంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు. నిమ్మతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే అనారోగ్యాల నుండి విముక్తి లభిస్తుంది. 
 
నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొవ్వు శాతం కూడా తగ్గుతుంది. నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి వారానికి రెండుసార్లు పళ్ళు తోముకుంటే పళ్లు మెరవడమే కాకుండా, చిగుళ్ళ వ్యాధులు ఉన్నవారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని అందంగా తయారుచేస్తాయి. తరచుగా నిమ్మకాయ లేదా దాని రసాన్ని తీసుకుంటే.. శరీరంలోని చెడు వ్యర్థాలన్నీ తొలగిపోతాయి.