గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (15:05 IST)

భోజనాంతరం తాంబూలం తింటే..? ఎప్పుడు తినకూడదో తెలుసా?

భోజనం చేసిన తరువాత.. అగరువత్తుల పొగవలన, కారం చేదు, వగరు కలిగిన ఫలరసముల వలనగానీ, వక్క, కస్తూరి, లవంగం, జాజికాయగానీ, తాంబూలముగానీ తీసుకోవడం వలన భోజనం వలన కలుగు కఫదోషములు తొలగిపోతాయి. మరికొన్ని ఆరోగ్య ఆయుర్వేద చిట్కాలు..
 
1. నిద్రలేచినప్పుడు, స్నానం చేసినపుడు, భుజించిన తరువాత, వాంతి అయినపుడు తాంబూలము వేసుకొనవచ్చును. తాంబూలంలో కారం, తీపి, వగరు, చేదు కలిగి ఉంటాయి. వీటి వలన వాత, కఫ వ్యాధులు దరిచేరవు. నోటియందు క్రిములు నశిస్తాయి. నోటిదుర్గంధము తొలగిపోతుంది. కామోద్దీపనము కలిగించును.
 
2.  తాంబూలంలో వాడు కాచు.. కఫ, పిత్తములను, సున్నము, వాతమును హరించగలవు. కాబట్టి... ఈ మూడు దోషములు తాంబూలము వలన పోవును. ఉదయాన్నే వక్క ఎక్కువగానూ, మధ్యాహ్నం.. కాచు ఎక్కువగానూ, రాత్రులు సున్నము ఎక్కువగానూ ఉండేలా తాంబూలాన్ని తయారుచేసుకోవాలి.
 
3. తాంబూలము నమిలేటపుడు... మొదటి జనించు రసం విషతుల్యమగును. రెండవసారి జనించు రసం అజీర్ణమునకు కారణమగును. మూడవసారి జనించే రసం అమృతతుల్యమగును. కాబట్టి తాంబూలం వేసికున్న తరువాత మొదటి రసాలను ఉమ్మివేస్తూ చివరి రసాలను మాత్రమే మ్రింగుట ఆరోగ్యకరం.
 
4. దంత పటుత్వం లేనివారు.. నేత్రరోగములు, విషము, మదుము, మూర్చ, గాయములు, రక్తపిత్తములు గల రోగములు గలవారు తాంబూలము సేవించరాదు.