సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (11:59 IST)

బిచ్చమెత్తుకుని తిని కాలమును గడపలేదా..?

నడవక చిక్కిలేమి యగునాడు నిజోదర పోషణార్థమై
యడిగి భుజించుట ల్నరుల కారయ వ్యంగ్యము కాదు పాండవుల్
గడు బలశాలు లేవురు సఖండవిభూతి దొలంగి భిక్షముల్
గుడువరె యేకచక్రపురి గుంతియు దా మొకచోట భాస్కరా...
 
అర్థం: మానవుడు కుటుంబము జరుగునప్పుడు ఒకరిని యాచించి తిని బ్రతుటకు తప్పుగాదు, మహాబలపరాక్రమసంపన్నులగు పాండవు లైదుగురును కావవశమున సంపదల బాసి తల్లితో గూడి యేకచక్రనగరమున బిచ్చమెత్తుకుని తిని కాలమును గడపలేదా..