1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. Get Summer Glow With Hibiscus Flower Face Masks

వేసవికాలం: మందార పువ్వు పేస్టుతో బంగారంలా మెరిసే చర్మం..

hibiscus
ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది ఎదుర్కొనే సమస్య చర్మ సమస్య. ఎండాకాలంలోనే కాదు చలికాలంలోనూ చర్మం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఎలాంటి సింథటిక్ కెమికల్స్ లేకుండా సహజసిద్ధంగా మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. మందార పువ్వు మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మందార మన చర్మాన్ని రక్షించడంలో ఎంతగానో సహకరిస్తుంది. 
 
మందార పువ్వును ఎండలో బాగా ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో తేనె, కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. మందార పొడిని తయారు చేయలేని వారు పువ్వును రాత్రంతా నీటిలో బాగా నానబెట్టి, ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసే ముందు ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ముఖాన్ని ఆవిరి పట్టాలి. దీంతో చర్మంలోని మురికి తొలగిపోతుంది. 
 
ఆ తర్వాత ముఖాన్ని బాగా తుడుచుకుని కలిపిన పేస్టును అప్లై చేయాలి. సుమారు 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత ఒకరోజు పాటు ముఖానికి ఎలాంటి సబ్బు వాడకూడదు. అప్పుడే అది అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఇలా వారానికోసారి చేస్తే మన ముఖం బంగారంలా మెరిసిపోతుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వెర్రి పుచ్చ వేర్లుతో ఊడిపోయిన వెంట్రుకలు మొలుస్తాయి, ఎలాగంటే?