1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. summer temperatures begins, here are beauty tips for healthy skin

ఎండలు బాబోయ్ ఎండలు, సూర్యకాంతికి చర్మం కమిలిపోకుండా ఇలా...

summer temperatures
ఫిబ్రవరి నెల అలా దాటిందో లేదో వేసవి ఎండలు దంచేస్తున్నాయి. వేడి గాలులు మొదలయ్యాయి. ఈ వేసవిలో ఎండల్లో తిరగడం వల్ల చర్మం పొడిబారినట్టుగా అవుతుంది. దీనికి అనేక రకములైన లోషన్స్ వాడుతుంటాము. అలాకాకుండా ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న పదార్దాలతోనే చిట్కాలు పాటించి అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టిప్స్ అనుసరిస్తే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. అవేంటో చూద్దాం.
 
మృదువైన చర్మం కోసం అరచెక్క నిమ్మరసాన్ని ఒక గుడ్డు తెల్లసొనలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.
 
ఇంట్లో చేసిన ఫేస్ ప్యాక్‌లే వాడాలి. అంటే పెరుగు, గంధం, టొమాటో జ్యూస్, కలబంద గుజ్జు కలిపిన ప్యాక్ ముఖానికి వేయాలి. ఈ మిశ్రమం ముఖచర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా మెరుపును కూడా ఇస్తుంది. 
 
బొప్పాయి రసాన్ని క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటుంటే సూర్యకాంతి వల్ల చర్మంపై ఏర్పడే గోధుమ రంగు మచ్చలు తగ్గిపోతాయి. చర్మం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి వాడాలి.
 
ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఓట్ మీల్, పాలు తీసుకుని కలపాలి. ఈ మిశఅరమాన్ని శుభ్రం చేసుకున్న ముఖానికి రాసుకోవాలి. దానిని మీ చేతివేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖఁపై ఉండే మృతకణాలు, అధికంగా ఉండే నూనెలు, దుమ్ముధూళి పోయి చర్మం శుభ్రపడుతుంది. పదిహేను నిమిషాలు ఆగి చల్లని నీటితో కడిగివేయాలి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
ఈ పదార్థాలు తింటే జుట్టు రాలడం ఖాయం