శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:00 IST)

శీతాకాలంలో శరీర ఛాయ మెరిసిపోయేందుకు 5 చిట్కాలు

శీతాకాలం రాగానే చాలామంది శరీరం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యను అడ్డుకునేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
బొప్పాయి గుజ్జు శరీరానికి రాసుకుని స్నానము చేస్తే శరీరములోని మృతకణాలు తొలగిపోతాయి.
 
బియ్యపు పిండితో నలుగు పెట్టి స్నానము చేస్తే చర్మము బగువుగా, కాంతివంతముగా ఉంటుంది.
 
నువ్వుల నూనె పొడి చర్మానికి చక్కగా పనిచేస్తుంది. శరీరము ఈ నూనెతో మర్ధన చేస్తే నున్నగా, కాంతివంతముగా తయారవుతుంది. చర్మానికి ఒకరకమైన మెరుపు వస్తుంది.
 
వేపాకుల ముద్ద, నిమ్మరసము కలిపి తలకు రాసుకుని గంటసేపు ఉండనిచ్చి తలస్నానము చేస్తే చుండ్రు పోతుంది.
 
ఓట్స్‌ని పొడిచేసి చర్మ శుద్ధి కి ఉపయోగించవచ్చు. ఈ పొడిని రుద్దుకుని ప్రతిరోజూ స్నానము చేయడం వల్ల శరీరానికి కాంతివంతమైన రంగు వస్తుంది.