శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (12:02 IST)

తుమ్ముతో జడుసుకుంటున్న జనం... పక్క మనిషి దగ్గినా భయమే...

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం అతలాకుతలమైపోయింది. ప్రతి ఒక్కరి జీవితాలు తారుమారైపోయాయి. కరోనా ముందు ఎలాంటి భయం లేకుండా సాఫీగా సాగిన జీవన ప్రయాణం ఇపుడు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా, ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందన్న ప్రచారం ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దీనికితోడు చలికాలం కావడంతో మరింతగా వణికిపోతున్నారు. అందుకే పక్కమనిషి ఎవరైనా తుమ్మితే జడుసుకుంటున్నారు. దగ్గినా భయపడుతున్నారు. 
 
సాధారణంగా చలికాలంలో సంక్రమించే సీజనల్‌ వ్యాధులు, కరోనా లక్షణాలను పోలి ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌‌లో ఎవరికైనా జలుబు లక్షణాలు కనిపిస్తే చాలు ఆందోళన చెందుతున్నారు. వీరితో మాట్లాడేందుకే సంకోచిస్తున్నారు. కరోనా లక్షణాల్లో దగ్గు, జలుబుతో పాటు తలనొప్పి, జ్వరం కూడా ఉన్నాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు. 
 
చలికాలానికితోడు వరుస పండుగలు, ఫంక్షన్లు ఉండటంతో సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెవ్‌ పట్ల అటు కేంద్రంతో పాటు.. ఇటు రాష్ట్రాలు కూడా హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలో సీజనల్‌ వ్యాధులు సోకినంత మాత్రాన కరోనా వచ్చినట్లు భావించొద్దని వైద్యులు చెబుతున్నారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రావాల్సిన ఉత్తరగాలులు కూడా ఇప్పుడే వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటల వరకు వాతావరణం చలిగానే ఉంటుంది. తిరిగి సాయంత్రం నాలుగైదు గంటల నుంచే చలిగాలులు వీస్తుండడంతో పాటు, చలి తీవ్రత పెరుగుతోంది. 
 
దీంతో చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. వీటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోయినప్పటికీ, శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని చెప్తున్నారు. పరిస్థితి అదుపుతప్పి ప్రాణాల మీదకు వచ్చేంత వరకు చూడొద్దని సూచిస్తున్నారు.