సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (11:57 IST)

కరోనా టీకాను మా దేశ ప్రజలకు తప్పనిసరి చేయబోము: బ్రిటన్

బ్రిటన్‌లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న వేళ ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. తమ దేశ ప్రజలకు టీకాను తప్పనిసరి చేయబోమని మంత్రి మాట్‌హన్‌కాక్ పేర్కొన్నారు. తమకు టీకా కావాలా, వద్దా అన్నది ప్రజలే నిర్ణయించికోవాలని తెలిపారు. 
 
అదేవిధంగా పిల్లలకు టీకా వేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తమ దేశంలో పిల్లలు కరోనా బారిన పడే అవకాశం తక్కువగా ఉందనీ, కాబట్టి వారికి టీకా వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చాలామంది ప్రజలు టీకా కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
 
ప్రపంచమంతా టీకా కోసం ఎదురుచూస్తున్న వేళ బ్రిటన్ మంత్రి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో కరోనా కేసులు సంఖ్య 12 లక్షల మార్కు దాటింది. బ్రిటన్‌లో రెండో దశ లాక్‌డౌన్ అమలవుతోంది.