శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: సోమవారం, 2 నవంబరు 2020 (21:25 IST)

ఉల్లి ధర ఘాటుకు కన్నీళ్లు, మహిళలు, వ్యాపారులు ఆందోళన

గత కొద్దిరోజులుగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిని కొనాలన్నా, కోయాలన్నా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. ఒక్కసారిగా పెరిగిన ధరతోపాటు అటు మహిళలు, వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలతో దిగుబడి దెబ్బతినడంతో ఉల్లి ధరతో పాటు కూరగాయల ధరలు సామాన్యుల జీవింలో తీవ్ర ఆందోళనను తెస్తున్నాయి.
 
ప్రస్తుతం ఉల్లి ధరను వింటేనే పేద, మధ్యతరగతి కుటుంబీకులు వణికిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ జిల్లాలో కిలో ఉల్లి ధర 100 నుండి 120 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో ఉల్లి కోయకుండానే కన్నీ ళ్లను తెప్పిస్తోందని ప్రజలు వాపోతున్నారు. అటు ఉల్లితో పాటు మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
 
దీంతో సామాన్యుడి బతుకు పెను భారంగా మారిపోతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉల్లి ధరను నియంత్రిచేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓ ప్రక్క వరద ప్రభావం, మరోవైపు కరోనా ఎపెక్ట్ ఈ రెండూ సామాన్యుని జీవితాన్ని చిదిమేస్తున్నాయి.