శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మే 2020 (17:09 IST)

ఉల్లిపాయ రసాన్ని ముఖానికి రాసుకుంటే..?

ముఖానికి ఉల్లిపాయ రసాన్ని రాసుకుంటే ముఖ చర్మం కోమలంగా తయారవుతుంది. ఉల్లిపాయలు తరిగిన తర్వాత వాటిలోంచి ఒక ముక్కను తీసుకుని మన కనుబొమ్మలకు రాసుకుంటే కనుబొమ్మలు నున్నగా వచ్చి మంచి షేప్ లోకి తయారవుతాయట. అలాగే బంగాళాదుంపలను చక్రాలుగా తరిగి దాన్ని కంటిపై వుంచితే నల్లటి వలయాలు తొలగిపోతాయి.  
 
అలోవెరాని జుట్టుకు పెట్టుకుని గంట తర్వాత హెయిర్ బాత్ చేస్తే జుట్టు నల్లగా, ఒత్తుగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత దానిమ్మగింజల రసాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు రోజా రేకుల్లా తయారవుతాయి. స్నానం చేసిన తర్వాత లిప్ స్టిక్‌కి బదులుగా కూడ దీనిని రాసుకోవచ్చు. ఇక నల్లని మచ్చలు తొలగిపోవాలంటే.. నిమ్మకాయ చెక్కతో రాయడం చేయాలి.