మెంతులు, ఉల్లి ముక్కలను నానబెట్టి తీసుకుంటే?
మెంతులను ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మెంతుల్లో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది కేశాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా జుట్టు నెరవదు. రోజూ 15 గ్రాముల మెంతులను నీటిలో నానబెట్టి తీసుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతం. ఇంకా రక్తపోటు తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.
అలాగే మెంతులను రోజూ డైట్‌లో చేర్చుకుంటే.. బరువు తగ్గుతారు. మధుమేహం దరిచేరదు. మెంతులను రాత్రిపూట నానబెట్టి.. ఉదయం పూట బాగా రుబ్బుకుని తలకు షాంపులా వేసి స్నానం చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది. వాత సంబంధిత రోగాలను మెంతులు దూరం చేస్తాయి. వేసవిలో మెంతులను రోజూ ఒక స్పూన్ మేర నీటిలో నానబెట్టి మజ్జిగలో చేర్చి తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.
మెంతులు, ఉల్లి ముక్కలను నానబెట్టి తీసుకుంటే వీర్యవృద్ధి చెందుతుంది. అల్లం ముక్కతో, అర స్పూన్ మెంతులను చేర్చి బాగా రుబ్బుకుని తీసుకుంటే పిత్త వ్యాధులు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.