2,301కి చేరిన కరోనా కేసుల సంఖ్య.. 56 మంది మృతి
కరోనా కేసుల సంఖ్య దేశంలోనూ పెరిగిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,301కి చేరింది. కరోనా వైరస్‌తో వ్యాపించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వచ్చి దాదాపు మూడు నెలలు దాటినా.. ఇప్పటికీ ఈ వ్యాధికి మందు దొరకడం లేదు. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను రిలీజ్ చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
ఇంకా రాష్ట్రాల వారీగా కూడా ఎన్ని కరోనా కేసులు నమోదైనాయో విడుదల చేసింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా అత్యధికంగా మహారాష్ట్రలో 356 కరోనా కేసులు నమోదైనాయి. అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో కేసు నమోదయ్యింది. ఇక దేశ వ్యాప్తంగా 2,301 మందికి కరోనా సోకగా, 157మంది డిశ్చార్జ్ అయ్యారు. భారతదేశం మొత్తంగా 56 మంది కరోనా వ్యాధితో మృతి చెందారు.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా గత మూడు రోజులుగా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య తెలంగాణను క్రాస్ చేసి ఏకంగా 161కు చేరుకుంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.