ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By pnr
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (12:17 IST)

ఐఆర్‌సీటీసీ రైల్వే టిక్కెట్లపై సేవా పన్ను రద్దు... భద్రతకు పెద్దపీట : విత్తమంత్రి

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణ టిక్కెట్లపై సేవా పన్నును రద్దు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2017-18 వ

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణ టిక్కెట్లపై సేవా పన్నును రద్దు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2017-18 వార్షిక బడ్జెట్‌ను ఆయన బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో... రైల్వే శాఖపై కీలక ప్రకటనలు చేశారు. రైల్వే బడ్జెట్ రూ.లక్షా 31 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. 
 
రైల్వేకు రూ.55 వేల కోట్లను ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. 2020 నాటికి బ్రాడ్ గేజ్ మార్గాల్లో గేట్ల ఏర్పాటు చేస్తామన్నారు. దేశీయ అవసరాలకు అనుగుణంగా కొత్త మెట్రో రైలు విధానాన్ని ప్రవేశపెడుతామన్నారు. ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సేవా పన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, రైల్వే ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ రూ.లక్ష కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, కేవలం పర్యాటకం, తీర్థయాత్రల కోసమే ప్రత్యేక రైలు నడుపుతామన్నారు. 2017-18లో 25 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ఐదు వందల స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 2000ల స్టేషన్లలో సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. 2019 నాటికి అన్ని రైళ్లలో బయో టాయిలెట్స్‌గా మారుస్తామన్నారు. మెట్రో రైలు మార్గాల ఏర్పాటులో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తామన్నారు.