EPFO పరిధిలోకి రాని ఉద్యోగుల కోసం అక్టోబర్ 31 వరకు ప్రత్యేక ప్రచారం
జూలై 1 నుండి అమలులోకి వచ్చిన ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ (ఈఈసీ) 2026, అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 1, 2009 నుండి మార్చి 31, 2026 మధ్య కాలంలో ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛందంగా నమోదు చేయడానికి యజమానులకు ఈ ప్రచారం ఒక ప్రత్యేకమైన, ఏకైక అవకాశాన్ని కల్పిస్తుంది.
అర్హులైన ఉద్యోగుల నమోదు ప్రక్రియను ఈపీఎఫ్ఓ యజమాని పోర్టల్ ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. నిబంధనల అమలును సులభతరం చేసే చర్యలో భాగంగా, వేతనం నుండి ఉద్యోగి వాటా ఈపీఎఫ్ చందాను మినహాయించని సందర్భంలో, ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత నుండి మినహాయింపు ఇవ్వబడింది.
యజమాని తన వాటా చందాతో పాటు వడ్డీ, పరిపాలనాపరమైన రుసుములు, ఏకమొత్తం నష్టపరిహారాన్ని (లంప్ సమ్ డ్యామేజ్) మాత్రమే జమ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్‌ను ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లో పొందవచ్చు.
