ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (14:05 IST)

ఈ-కామర్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఫ్లిఫ్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్

Flipkart
ఈ-కామర్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్ ఎట్టకేలకు బిగ్ బిలియన్ డేస్ సేల్-2024 తేదీ, వివరాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా సేల్ ప్రారంభమవుతుందని, అనేక రకాల ఉత్పత్తులపై ఈ ఏడాది భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. 
 
'ఫ్లిప్కార్ట్ ప్లస్' సభ్యులకు ఒక రోజు ముందుగానే.. అంటే సెప్టెంబర్ 29 నుంచే ఈ సేల్ ప్రారంభమవుతుందని ఫ్లిప్కార్ట్ తెలిపింది. దసరా, దీపావళి పండుగలకు ముందు ఈ సేల్ జరగనుంది. 
 
ఫ్లిఫ్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సమయంలో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తులతో పాటు ఇతర మరికొన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ల కోసం కస్టమర్లు ఎదురుచూస్తుంటారు. 
అంచనాలకు తగ్గట్టే ఈ ఏడాది భారీ ఆఫర్లు ఇవ్వబోతున్నట్టు ఫ్లిఫ్ కార్ట్ పేర్కొంది. 
 
ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభించనున్నాయని కంపెనీ పేర్కొంది.