పాత నోట్లపై కొత్త పిడుగు.. రూ.10 వేలకు మించి ఉంటే ఫైన్
దేశంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయ్యాయి. కానీ, అనేక మంది వీటిని ఇంకా భద్రపరుచుకుని ఉన్నారు. వీలాంటి వారిపై కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత రూ.10 వేలకు మించి పాత నోట్లు క
దేశంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయ్యాయి. కానీ, అనేక మంది వీటిని ఇంకా భద్రపరుచుకుని ఉన్నారు. వీలాంటి వారిపై కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత రూ.10 వేలకు మించి పాత నోట్లు కలిగి ఉన్నవారిపై సర్కారు జరిమానా కొరడా విధించబోతున్నట్లు సమాచారం.
ఇందుకోసం ఈనెల 30వ తేదీలోపు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చేలా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ కథనం ప్రకారం.. 500 నోట్లు కావొచ్చు.. లేదా పాత వెయ్యి నోట్లు కావొచ్చు! ఏవైనాగానీ.. ఎవరి వద్దా గరిష్టంగా 10 నోట్లకు మించి ఉండటానికి వీల్లేదు. అంటే రూ.10 వేల పరిమితి. అంతకుమించి కలిగి ఉన్నా, ఎవరి వద్ద నుంచైనా స్వీకరించినా.. లేదా ఎవరికైనా ఇచ్చినా.. దాన్ని శిక్షించదగిన నేరంగా పరిగణిస్తారు.
అలాంటివారిపై కనీస జరిమానా రూ.50 వేలు లేదా.. వారి వద్ద ఉన్న సొమ్ముకు 5 రెట్ల సొమ్ము.. ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధించేలా ఆర్డినెన్స్ తేనున్నట్టు పేర్కొంది. ఇలాంటి కేసులను మున్సిపల్ మేజిస్ట్రేట్ విచారించి జరిమానాను నిర్ణయిస్తారని వివరించింది.