రోజూ 12 కోట్లకు పైగా కాల్స్ ఫెయిల్.. జియో ఫిర్యాదు.. ట్రాయ్ వార్నింగ్..
ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా నెట్ వర్క్‌ల మధ్య రోజూ 12 కోట్లకు పైగా కాల్స్ ఫెయిల్ అయ్యాయని జియో ఇన్ఫోకామ్ పేర్కొంది. ఇతర టెలికామ్ కంపెనీల నెట్‌వర్క్‌లకు.. కొత్తగా వచ్చిన రిలయెన్స్ జియో సంస్థకు మధ్య 80
ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా నెట్ వర్క్‌ల మధ్య రోజూ 12 కోట్లకు పైగా కాల్స్ ఫెయిల్ అయ్యాయని జియో ఇన్ఫోకామ్ పేర్కొంది. ఇతర టెలికామ్ కంపెనీల నెట్‌వర్క్‌లకు.. కొత్తగా వచ్చిన రిలయెన్స్ జియో సంస్థకు మధ్య 80 శాతంపైగా సాగిన కాల్స్ విఫలమయ్యాయని ట్రాయ్ పేర్కొంది. ఇలా కాల్ ఫెయిల్యూర్స్ మరీ పెరిగిపోయాయని.. దీనిపై అవసరమయితే లీగల్ చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ హెచ్చరించారు.
ఈ నెల 15-19 తేదీల మధ్య కాల్ ట్రాఫిక్ డేటాను తాము స్టడీ చేశామని, ఇది సర్వీసు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఆమోదయోగ్యంగా లేవని ఆయన చెప్పారు. ఇక రోజువారీ కాల్ వివరాలను తాము విశ్లేషిస్తామని శర్మ తెలిపారు. నెట్ వర్క్‌ల మధ్య తగినన్ని ఇంటర్ కనెక్షన్ పాయింట్లు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని శర్మ అభిప్రాయపడ్డారు.
ఈ పోకడ భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ వంటి వాటికి దెబ్బేనన్నారు. జియోకు ఉన్న సబ్ స్క్రైబర్ల కన్నా చాలా ఎక్కువమంది సబ్ స్క్రైబర్లు తమకు ఉన్నారని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. కాల్ ఫెయిల్యూర్స్ పై టెలికాం ఆపరేటర్ల నుంచి తమ సంస్థ వివరణలు కోరుతోందని శర్మ తెలిపారు.