మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (15:12 IST)

ఎల్ఐసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఐతే ఇలా చేయండి..

ఎల్ఐసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఐతే ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. అంతేకాకుండా ఎల్‌ఐసీలో పలు రకాల పాలసీ స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. అయితే వీటిల్లో ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒక భాగంగానే చెప్పుకోవచ్చు. ఇక ఈ పాలసీ తీసుకోవడం వల్ల రోజుకు రూ.70 ఆదా చేయడంతో చేతికి ఏకంగా రూ.50 లక్షలు పొందొచ్చు. అయితే ఈ పాలసీకి కనీసం 18 ఏళ్లు వయసు కలిగిన వారు ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవచ్చు. అంతేకాదు గరిష్టంగా 35 ఏళ్ల వరకు పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. 
 
ఇక కనీసం రూ.లక్ష మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి వుంటుంది. దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక రిస్క్ కవర్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. పాలసీ మెచ్యూరిటీ సమయంలో మీ డబ్బులతోపాటు బోనస్, ఇంకా ఇతర ప్రయోజనాలు లభిస్తాయని ఎల్ఐసీ అధికారులు తెలపారు. ఇది ఎండోమెంట్ పాలసీ. అందువల్ల ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఉంటాయి.
 
అయితే ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల మెచ్యూరిటీ సమయంలో రూ.50 లక్షలు ఎలా పొందొచ్చంటే..? దీని కోసం మీరు రోజుకు రూ.70 ఆదా చేస్తే సరిపోతుంది. అయితే ఉదాహరణకు మీకు 18 ఏళ్ల వయసు ఉంది. రూ.10 లక్షలకు 35 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు మీ వార్షిక ప్రీమియం దాదాపు రూ.26,000 అవుతుందని ఎల్ఐసీ అధికారులు తెలిపారు.