శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (11:46 IST)

వచ్చే నెలలో రూ.200 నోటు.. ఆతర్వాత రూ.50 నోటు

దేశంలో తొలిసారి 200 రూపాయల నోటు చెలామణిలోకి రానుంది. ఈ తరహా నోటును చ‌రిత్ర‌లో తొలిసారి ప్ర‌వేశ‌పెట్ట‌డానికి భారతీయ రిజర్వు బ్యాంకు సిద్ధమవుతోంది. వీలైతే ఈ నెల చివ‌ర్లో లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలోనే

దేశంలో తొలిసారి 200 రూపాయల నోటు చెలామణిలోకి రానుంది. ఈ తరహా నోటును చ‌రిత్ర‌లో తొలిసారి ప్ర‌వేశ‌పెట్ట‌డానికి భారతీయ రిజర్వు బ్యాంకు సిద్ధమవుతోంది. వీలైతే ఈ నెల చివ‌ర్లో లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలోనే ఈ కొత్త 200 నోటు బ‌య‌ట‌కు రానుంది. 
 
సుమారు 50 కోట్ల 200 నోట్ల‌ను ఆర్బీఐ మార్కెట్‌లోకి తీసుకురానున్న‌ది. మార్కెట్‌లో ఈ నోటుకు కొర‌త లేకుండా, బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌ల‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌తదేశ చరిత్ర‌లో 100 నుంచి 500 మధ్య ఎలాంటి నోటు లేదు. అందుకే 200 నోటు మార్కెట్‌లో బాగా పాపుల‌ర్ అవుతుంద‌ని ఆర్బీఐ భావిస్తున్న‌ది. అందుకు త‌గిన‌ట్లే వాటి కొర‌త లేకుండా చూసుకుంటున్న‌ది అని ఆర్బీఐ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. 
 
కాగా, ఈ 200 నోట్ల వ‌ల్ల త‌క్కువ విలువ ఉన్న నోట్ల కొర‌త తీర‌నుంది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత మార్కెట్లో పెద్ద నోట్ల చెలామ‌ణి 86 శాతం నుంచి 70 శాతానికి ప‌డిపోయింది. ఈ 200 నోటు వ‌స్తే వాటి వాడ‌కం మ‌రింత త‌క్కువ‌వుతుంద‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.