శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 27 జులై 2023 (17:39 IST)

ఎడతెగని వర్షాలకు వినోదంతో విరుగుడు: జియో ఫైబర్ 398 ప్లాన్‌తో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్

Jio
ఎడతెగని వర్షాలతో ఇళ్లకే పరిమితమైన వారికి నిరంతరాయంగా వినోదం, కనెక్టివిటీని అందించడానికి జియో ఫైబర్ అసమానమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. తెలంగాణ అంతటా ఉత్తమ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌గా నిలిచిన జియో ఫైబర్ ఇప్పుడు కేవలం నెలకు రూ. 398తో సరికొత్త ప్లాన్‌ను ప్రారంభించడం ద్వారా మరోసారి వినియోగదారులకు దగ్గరవుతోంది. ఈ అద్భుతమైన ప్లాన్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది, ఇది కస్టమర్లు తమ ఇంట్లో వినోదం మరియు కనెక్టివిటీని అనుభవించే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. 
 
జియో ఫైబర్ టీవీ ప్లాన్ ముఖ్యాంశాలు:
- 750+ లైవ్ టీవీ ఛానెల్‌లు వీక్షించవచ్చు 
- Netflix, Amazon Prime, Disney Hot Star, SunNxt, SonyLiv, Zee5తో సహా 14 అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం OTT ప్లాట్‌ ఫామ్‌లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా యాక్సెస్. కస్టమర్‌లు ఇప్పుడు తమకు ఇష్టమైన షోలు మరియు చలనచిత్రాలను ఎలాంటి పరిమితులు లేకుండా వీక్షించగలరు.
 
- అపరిమిత డేటాతో కాంప్లిమెంటరీ ఇంటర్నెట్ ప్లాన్, నిరంతరాయంగా స్ట్రీమింగ్ మరియు బ్రౌజింగ్ అనుభవాలను అందిస్తుంది.
 
- అపరిమిత కాల్స్‌తో కూడిన ఉచిత ల్యాండ్‌లైన్, కాల్ ఛార్జీల గురించి చింతించకుండా కస్టమర్‌లు తమ ప్రియమైన వారితో కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.
 
ఇదే క్రమంలో జియో ఫైబర్ ప్రత్యేకమైన మాన్‌సూన్ ఆఫర్‌ను పరిచయం చేస్తోంది. మాన్‌సూన్ ఆఫర్‌ని పొందుతున్న కస్టమర్‌లు ఉచిత 4K సెట్-టాప్ బాక్స్‌తో పాటు ఉచిత గిగా ఫైబర్ రూటర్ ను అందుకుంటారు. వీటి మొత్తం విలువ రూ. 10,000 . అదనంగా, జీరో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు మరియు జీరో డిపాజిట్ సౌలభ్యం ఉంది. మాన్‌సూన్ ఆఫర్ ను  పొందగోరే కస్టమర్లు 6 నెలల పాటు ముందస్తు రీఛార్జ్‌ని ఎంచుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం. జియో ఫైబర్  కొత్త టీవీ ప్లాన్‌తో వినోదం మరియు కనెక్టివిటీ అనుభవాన్ని ఆస్వాదించండి. ఈ ప్లాన్ పై మరిన్ని వివరాలకు మీ సమీప జియో స్టోర్‌ని సందర్శించండి.