బుధవారం, 5 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2016 (17:23 IST)

హృద్రోగం, అతిమూత్ర వ్యాధితో బాధపడుతున్న రోగికి పొత్తికడుపులో కణితి తొలగింపు

అత్యంత అరుదైన ఆపరేషన్ ద్వారా ఓ మహిళ పొత్తికడుపులో ఉన్న కణితిని చెన్నైలోని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. కణితి, హృద్రోగం, మూత్రాశయ వ్యాధితో బాధపడుతున్న 40 ఏళ్ల మహిళకు ఫోర్టిస్ మలర్ ఆసుపత్

అత్యంత అరుదైన ఆపరేషన్ ద్వారా ఓ మహిళ పొత్తికడుపులో ఉన్న కణితిని చెన్నైలోని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. కణితి, హృద్రోగం, మూత్రాశయ వ్యాధితో బాధపడుతున్న 40 ఏళ్ల మహిళకు ఫోర్టిస్ మలర్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. అపర్ణ అనే 40 ఏళ్ల మహిళకు వైద్యులు అత్యంత కీలకమైన శస్త్రచికిత్సను నిర్వహించారు.
 
ఈ శస్త్రచికిత్సలో ఆ మహిళ పొత్తికడుపులో 18-20 సెంటీమీటర్ల కణితిని తొలగించారు. ఫలితంగా ఆ మహిళకు మలర్ ఆస్పత్రి వైద్యులు ప్రాణదానం చేసినట్లైంది. శస్త్రచికిత్సకు ముందు జాగ్రత్తగా పలు పరీక్షలు చేసినట్టు తెలిపారు. సమగ్రమైన పరీక్షల అనంతరం డాక్టర్ నిత్యా ఆధ్యర్వంలో మదనమోహన్, దీపిక్ సుబ్రహ్మణియన్, గురుబాలాజీ, సురేష్ రావులతో కూడిన వైద్య నిపుణుల బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
 
పొత్తి కడుపు నొప్పితో పాటు పేగుల వాపుతో, అతిమూత్ర వ్యాధితో బాధపడేదని, బరువు బాగా తగ్గి.. బక్కపలచగా మారిపోయిందని శస్త్రచికిత్స చేసిన వైద్యులు తెలిపారు. ఇంకా ఆ మహిళ సిరల్లో రక్తం గడ్డకట్టుకోవడం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడేది. దీనికి తోడు ఆమెకు ఆరు నెలల ప్రాయంలోనే గుండె రెండు కవాటాల మధ్య పెద్ద రంధ్రం ఏర్పడిందని.. ఇవన్నీ పరీక్షల ద్వారా ధ్రువీకరించి శస్త్రచికిత్సను విజయవంతం చేశామన్నారు. ఈ మహిళ త్వరలోనే సాధారణ జీవితంలోకి అడుగుపెడుతుందని ఆస్పత్రి వైద్యులు చెప్పుకొచ్చారు.