బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 15 జులై 2017 (21:18 IST)

షాకింగ్... కడుపులో కండోమ్స్... లోపల వజ్రాలు...

బంగారాన్ని మింగేసి కడుపులో పెట్టుకుని అక్రమ స్మగ్లింగ్... లోదుస్తుల్లో బంగారు బిస్కెట్లు పెట్టుకుని స్మగ్లింగ్... ఇత్యాది వార్తలను మనం నిత్యం చూస్తూనే వుంటాం. తాజాగా కస్టమ్స్ అధికారులే షాకయ్యే మరో స్మగ్లింగ్ విధానం బయటపడింది. అదేంటయా అంటే... కండోమ్‌ల

బంగారాన్ని మింగేసి కడుపులో పెట్టుకుని అక్రమ స్మగ్లింగ్... లోదుస్తుల్లో బంగారు బిస్కెట్లు పెట్టుకుని స్మగ్లింగ్... ఇత్యాది వార్తలను మనం నిత్యం చూస్తూనే వుంటాం. తాజాగా కస్టమ్స్ అధికారులే షాకయ్యే మరో స్మగ్లింగ్ విధానం బయటపడింది. అదేంటయా అంటే... కండోమ్‌లో వజ్రాలను నింపి తరలించడం.
 
వివరాలను చూస్తే... శుక్రవారం నాడు కొలంబో నుంచి చెన్నైకు వచ్చిన విమాన ప్రయాణీకులను కస్టమ్స్ అధికారులు యథాప్రకారం తనిఖీలు చేపట్టారు. ఐతే ఇటీవలే చెన్నై నుంచి కొలంబో వెళ్లి తిరిగివస్తున్న ఓ యువకుడు మాత్రం వారికి తేడాగా అనిపించాడు. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని ఆసాంతం టెస్ట్ చేశారు. 
 
లోపలికి తీసుకెళ్లి అతడి పొట్టను పరీక్ష చేయగా ఏదో వున్నట్లు కనిపించింది. దీంతో అతడికి ఎనీమా చేయడంతో లోపల నుంచి మూడు కండోమ్స్ బయటపడ్డాయి. ఆ కండోమ్స్ లోపల 18 వజ్రాలను చూసి వైద్యులు షాకయ్యారు. కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.